ఇండియన్ గాడ్ ఫాదర్ సత్య 2
మనిషి ఎప్పటికప్పుడు తన రూపాన్ని ,దాని వెనుక దాగున్న సత్యాన్ని నెమరు వేసుకుంటూ వుంటాడు .అది ప్రకృతి భీబత్సాల నడుమ బ్రతుకుతున్నారు కాబట్టి అవసరం లా మారిపోయింది .అలాగే క్రైమ్ కూడా తన రూపం మార్చుకుంటుంది అంతే.ఇది సత్య 2 లోని కథ .ఎన్నో సంవత్సరాల క్రితం సత్య తో అందరిని అలరించిన రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ మార్క్ తో సత్య2 ని తెరకెక్కించాడు .
సత్య2 సినిమా చుసిన అందరు కూడా సత్య లాగానే ఆలోచిస్తారు అని అనిపించింది .సత్య ఆలోచనలోని force ని చూస్తుంటే నిజంగా సత్య లా ఆలోచిస్తే చేసేయగలం అన్నంత స్పష్టమైన ఆలోచన విధానాన్ని ,ఆ క్యారెక్టర్ లోని ఇంటెన్సిటీ ని create చేసిన రాము గారిని అభినందించాలి .మళ్లీ తన మనసుతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఈ భారత దేశాన్ని తన ఆలోచనల ప్రవాహం తో ఉలిక్కి పడేలా చేసాడు .
సినిమా technicalities ,కథలోని సారం ,ప్రతి frame లో నిబద్ధత ఒక రామాయణం లోని నియమాలని ,మహాభారతం లోని సౌరభాలని ఈ ఒక్క సత్య2 సినిమా తో రాము గారు చెప్పారనటం లో సందేహం లేదు .సినిమా చూస్తున్నంత సేపు నిజంగా రామ్ గోపాల్ వర్మ క్రైమ్ సైడ్ వుండివుంటే ఎలా ఉంటాడో కనిపించింది .
మనిసి పుట్టుక ఏదో ఒకటి సాధించడానికి
అని తెలుసుకొని ఏదో ఒక రంగాన్ని ఎంచుకుంటాడు ..తను ఎంచుకున్న రంగం లో తనకు ఎంత లోతైన అవగాహనా ఉండి పనిచేయాలో చెప్పే అతి గొప్ప చిత్రం సత్య2 .ఒక ప్రజాస్వామిక దేశం లో ఒక సిస్టం కి వ్యతిరేకంగా నడిచిందంటే ఆ సిస్టం లో లోపాలు ఉన్నట్టే అని రాము గారు తన మొదటి సినిమా' శివ' నుంచి చెబుతూనే వున్నాడు కాని ఆ విషయం సామాన్య మానవునికి గాని ,ప్రజాస్వామ్యానికి సేవ చేస్తున్నాం అని చెప్పుకునే రాజకీయ నాయకుడికి గాని అర్థం కాలేకపోవడం నిజంగా దురదృష్టకరం .
"నేను మొదటగా సర్కార్ సినిమా చూసినపుడు కలిగిన
ఎమోషనల్ ఇంటెన్సిటీ కనిపించింది. ,ఇలాంటి సినిమా మళ్లీ ఎప్పుడు తీస్తాడు RGV అని ఎదురు
చూసే ప్రేక్షకులకి కొంత ఊరట కలిగించాడని చెప్పాలి ,కాని సత్య2 తో
కొంతైనా తను సత్య2 తో తన మార్క్
ని చూపించగలిగాడు .కొన్ని సీన్స్ లో రామ్ గోపాల్ వర్మ ఇమేజ్ కనిపించేలా తీస్తే కొన్ని
సీన్స్ మాత్రం కొంచెం తగ్గినట్టు సగటు ప్రేక్షకుడు భావిస్తాడు. ప్రేక్షకుడి
expectations కి కొద్ది దూరం లో ఈ సినిమా నిలిచి
నందుకు తన అభిమానులు ,విమర్శకులు రామ్ గోపాల్ వర్మ ని అభినందించకుండా వుండలేరేమో ?.
ఎందుకు సత్య2 అంటే సిస్టం కూడా సత్య రూల్స్ ని సిద్ధాంతాలని నమ్మితే భారత దేశం లో పేదరికం అనేది ఉండదు ,అవినీతి ఉండదు .ఇంకో విషయం ఏమిటంటే పోలీస్ వ్యవస్థ మీద రాము గారికి వున్నా మక్కువో లేదంటే దేశం లో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గ వుంటే అవినీతి అనేది పూర్తిగా తగ్గుతుందనే భావనో తెలియదు కాని అది నూటికి నూరుపాళ్ళు నిజం ."
మనిషి కి commonscence అనేది ఎంత ముక్యమో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది .శర్వానంద్ ఈ సినిమాతో హాలీవుడ్ మూవీ ఛాన్స్ వచ్చిన ఆచర్య పోవాల్సిన పనిలేదు .అంత గొప్పగా చేసాడు .ఇక అనైక తన క్యారెక్టర్ కి చాల వరకు న్యాయం చేసింది ,అన్నిటికంటే తన అందం,అమాయకత్వం ,నిజాయితి ,స్వచమైన ప్రేయసి ఎలా ఉంటుందో అల అనిపించింది.అంటే ఆ స్వచ్చత కూడా RGV గారి ఆలోచనలోంచి
పుట్టిన ఒక అమాయకపు ప్రేమ లో ఉండేలా ఆ అమ్మాయిని ఎన్నుకున్నారు .
తక్కువ మాటలతో ఎక్కువ అర్థాన్ని వచ్చేలా చెప్పటం Ram
gopal varma కి మాత్రమే చెల్లింది ,క్లైమాక్స్ లో అంత సేపు సిస్టం గురించి శర్వానంద్ మాట్లాడక ఒక్క నిమిషం నిశబ్ధం అయిపోయాక కేవలం తన చేయితో పురుషోత్తం అనే పోలీస్ ఆఫీసర్ ని వెళ్ళిపో అని చెప్పటం నిజంగా చాల గొప్పగా అనిపించింది .
క్రైమ్ అనేది కేవలం లా లో రాసుకున్న పధం మాత్రమే ,కానీ అది ఎప్పుడు ఎందుకొసం పుట్టిందో ,ఎందుకోసం పుడుతుందో తెలిస్తే క్రైమ్ ని మనం తప్పు అనం అని చెప్పిన మాటలకూ ఎలా స్పందించాలో అర్థం కానిపరిస్తితి .ఢిల్లీ గ్యాంగ్ రేప్ ని దృష్టిలో పెట్టుకుని MLA కొడుకుని చంపే సీన్ కి ధియేటర్ లో చప్పట్ల మోత మోగడం నా కళ్లారా చూసాను .
కంపెనీ లో పనిచేసే మనుషులకు ,తను చెప్పే మాటలు చూస్తుంటే RGV
తో వోడ్కా తాగుతూ వున్నప్పుడు RGV
తన ఫ్రెండ్స్ కి చెప్పే మాటల్లగా అనిపించింది .భారత దేశానికీ అభివృద్ధి ఎలా వస్తుంది అనే విషయం RGV
కి తెలిసినంతగా రాష్ట్రపతికి కూడా తెలిసి
వుండదేమో? .
ఇదంతా మీ సినిమా గొప్పతనం అయితే RGV లోని క్రియేటివిటీ కి నిదర్సనం అయితే,కొన్ని లోపాలు మాత్రం వున్నాయి అవి అంత లోతుగా చూస్తే అవి ఏంటంటే ఇలా ...
1)సత్య తన ఫ్రెండ్ గణేష్ ని చంపాడని తన పెళ్ళాం ముందే ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపేస్తాడు ,ఆ తర్వాత తన భార్య ఏమై పోయిందో తెలియదు.
2)క్లైమాక్స్ కి వచ్చేపటికి సత్య తన కంపెనీ ని చాలా గొప్పగా తెరచి దిద్దుతాడు ,కాని ఆ కంపెనీ రూల్స్ తో ఇంకా ఏమేమి చేయగలదో చెప్పుంటూ ఇంకా చాలా బాగుండేది అనిపించింది .
ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాలను మాములుగా అయతే backdrop స్టొరీ పెట్టి చెప్పేవారు కాని పోలీస్ ఎంక్వయిరీ లో సత్య backdrop గురించి కేవలం ఫోన్ లో మాటలతో పోలీస్ అయిన పురుసోత్తం క్యారెక్టర్ తో చెప్పించారు ,అది ఎవరికీ రాని
ఆలోచన , ఎవరికీ రాదూ కూడా.
సాంగ్స్ విషయానికి వస్తే ,RGV
పాడిన ,ఓ ప్రియ ఓ ప్రియ సాంగ్ లొకేషన్స్ ,అండ్ ఎమోషన్ చాలా బాగా పండించారు .కెమెరా ని కేవలం ఒక్కొక్క పార్ట్ దగ్గర పెట్టి అనైక అందాన్ని చాలా గొప్పగా చూపించారు
.పాట చివరలో ఆమె వీపు బాగాన కెమెరా పెట్టి మత్తేక్కేలా చేసారు cameramen.
నోట్: శివ ,సర్కార్ ,నాట్ అ లవ్ స్టొరీ ,రంగీల ,తర్వాత అంత గొప్ప సినిమా సత్య2 ..మనిషి ఎదుగుదలకు కావాల్సిన ఎన్నో ప్రాథమిక విషయాలు ఈ చిత్రం లో వున్నాయి ,వాటిని చూసి నేను చాలా నేర్చుకున్నాను ..ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా "ఇండియన్ గాడ్ ఫాదర్ " లా వుంది .
ఉచిత సలహా :ఈ సినిమా ని హాలీవుడ్ కి తేసుకేల్తే అక్కడి వాళ్ళు కూడా రాము గారిని నెత్తిన పెట్టుకుంటారు ,ఎందుకంటే వాళ్ళ క్రైమ్ మూవీస్ లో క్రైమ్ వుంటుంది కాని ఎమోషన్స్ వుండవు ,ఆ ఎమోషన్స్ ,intense తో తీయగల సత్త కేవల రామ్ గోపాల్ వర్మ కి మాత్రమే వుంది కాబట్టి .
ఇంతకంటే RGV
సినిమా గురించి మాట్లాడే అర్హత ,వయసు నాకు లేవు ,అందుకే ఇంతటితో నా సమీక్ష ని ముగిస్తున్నాను .
పోస్ట్ నోట్ :జీవితం లో ఏమి సాధించాలో ఒక క్లారిటీ తెచ్చుకోవాలంటే సత్య2 సినిమా చుడండి .
-Narendra
No comments:
Post a Comment